Reading Time: < 1 minute

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ’దేఖ్‌లేంగే సాలా’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ పాట పవన్ కళ్యాణ్ డ్యాన్స్ తో అభిమానులను అలరిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం కానుకగా ఈ చిత్రం నుంచి పవన్‌కళ్యాణ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పవర్‌స్టార్ చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు.

స్టైలిష్ లుక్‌లో పవర్‌స్టార్

పవన్‌కళ్యాణ్ తన కొత్త చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ కొత్త సంవత్సరం కానుకగా ప్రకటించారు. సురేందర్ రెడ్డికి మెగా హీరోలతో మంచి ట్రాక్ రికార్డు ఉంది. రేస్ గుర్రం, ధృవ, సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ హిట్స్‌ను అతను అందించాడు. ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్‌తో పని చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మాణం వహిస్తున్నారు.