Reading Time: < 1 minute

ముంబై: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌పై సెలెక్టర్లు చిన్నచూపు చూడడం సరికాదని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆవేదన వ్యక్తం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీలతో పాటు తాజాగా విజయ్ హజారే టోర్నీలోనూ సర్ఫరాజ్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడన్నాడు. అయినా అతనికి టీమిండియాలోచోటు దక్కక పోవడం బాధకు గురి చేస్తుందన్నాడు. ఇప్పటికైనా సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.