Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా( 80) కన్ను మూశారు. నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రికి చేరారు. ఢాకా లోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖలీదా తుదిశ్వాస విడిచారు. 1945 ఆగస్టు 15న బంగాల్ జల్ పాయి గుడిలో జన్మించారు. బంగ్లాదేశ్ మాజీ రాష్ట్రపతి రెహమాన్ సతీమణి. ఖలీదా జియా రెహమాన్ స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్ పర్సన్ గా, బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో రెహమాన్ హత్య తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.1981 నుంచి బంగ్లాదేశ్ నేషలలిస్ట్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. 1982లో సైనిక తిరుగుబాటును అణచివేసి ప్రజాస్వామ్యం నెలకొల్పారు. ఖలీదా జియా అవామీలీగ్ నాయకురాలు షేక్ హసీనా ప్రత్యర్థి. విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఖలీదా జియాకు 17 ఏళ్లు జైలు శిక్ష వేశారు.