Reading Time: < 1 minute

‘పతంగ్’ సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తోందని అన్నారు దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం పతంగ్. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్, రిష్న్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ స్పోర్ట్ డ్రామా చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సినిమా చూసి దిల్ రాజు, ఎస్‌కేఎన్, సందీప్‌కిషన్, బెల్లంకొండ సురేష్‌లు ఎంతో మెచ్చుకున్నారు అని తెలిపారు.