Reading Time: < 1 minute

అమరావతి: విజయనగరం జిల్లాలో గజపతినగరం రైల్వైస్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్టును మినీ వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఒడిశాలోని రాయఘడ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని.. వాహనాన్ని పక్కకు తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులు విశాఖకు చెందిన వినయ్ కుమార్, దినేష్ గా పోలీసులు గుర్తించారు.