Reading Time: < 1 minute

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆ కనకదుర్గ గుడికి ఊహించని ‘షాక్’ తగిలింది. కనకదుర్గ గుడికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఆలయ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రూ.3.08 కోట్ల కరెంటు బిల్లు బకాయిలున్నట్లు ఎపిసిపిడిసిఎల్ అధికారులు తెలియజేశారు. బకాయిల కోసం నోటీసులు ఇచ్చిన స్పందన లేదని అన్నారు. హెచ్‌టి లైన్ నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అయితే భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు. తమ సోలార్ ప్లాంట్‌ నుంచి విద్యుత్ ఇస్తామని అన్నారు. విద్యుత్ శాఖను నెట్ మీటరింగ్ కోసం పలుమార్లు దేవస్థానం కోరింది. దాదాపు మూడు గంటలపాటు ఎపిసిపిడిసిల్ దేవస్థానానికి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. అయితే దుర్గ గుడి ఇవొతో, విద్యుత్ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.