
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ సిబ్బంది శనివారం అమీర్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…తోట హన్మంతు, బప్పన్న ప్రణయ్ సుకుమార్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది ఎస్సై మంజు, సిబ్బంది కలిసి దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం వారిని అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.