Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మాసీవ్ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను శనివారం రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డ్యాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ను సృష్టించారు. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో చిరంజీవి మెగా స్వాగ్‌తో కనిపిస్తే, రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. ఈ సాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్ గా మ్యూజిక్ చార్ట్‌ను షేక్ చేయబోతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా ప్రారంభించడానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.