Reading Time: < 1 minute
Star Heroine Kajol Playing Ntrs Mother In The Movie Dragon

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్  చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కూడా నటిస్తున్నారు.

Also Read : Delhi High Court : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ

తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజోల్, ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజోల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తల్లిగా కనిపించనుందట. ఇది నిజమైతే, ఇది ఆమె కెరీర్‌లో మరో డిఫరెంట్, పవర్‌ఫుల్ పాత్రగా నిలుస్తుందండనడంలో సందేహం లేదు. ప్రశాంత్ నీల్ గత చిత్రం KGF – 2 లో బాలీవుడ్ నటి రవీనా టండన్ ను కీలకమైన పాత్రలో పవర్ఫుల్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ – నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో కాజోల్ కు మంచి రోల్ ఉండే అవకాశం ఉంది. భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.