Reading Time: < 1 minute

ఇండోనేషియాలో రెండోసారి భారీ భూకంపం : ఈసారి అప్పట్లో సునామీ వచ్చిన ఏరియాలోనే..

Caption of Image.

ఇండోనేషియా దేశంలో మళ్లీ భారీ భూకంపం వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీ తెల్లవారుజామున 7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత.. 10 గంటల వ్యవధిలోనే మరో భారీ భూకంపం రావటంతో జనం విలవిలలాడుతున్నారు. ఇండోనేషియా ఉత్తర సుమత్రా దీవుల్లో 6.8 తీవ్రతతో రెండో భూకంపం రావటంతో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. భూమికి 163 కిలోమీటర్ల లోతులో.. ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెన్స్ ప్రకటించింది.

2026 ఆగస్టు 15 తెల్లవారుజామున వచ్చిన భూకంపం 38 మందిని బలిగింది. ఆ తర్వాత మళ్లీ 6.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అక్కడి జనాలు ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రెండు సార్లు  భూకంపంతో కొండచరియాలు విరిగిపడగా.. పవర్ కట్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినట్లు స్థానిక మీడియ తెలిపింది. రోడ్లపైన కొండ చరియలు విరిగిపడటంతో రవాణా అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. 

భూకంపంతో దాదాపు 2 వేల మందిని ఖాళీ చేయించినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ భూకంపానికి కారణం.. ఇండోనేషియా కింద భూ పలకల అడ్జస్ట్మెంట్ వలన సంభవించినట్లు భూకంప కేంద్రం పేర్కొంది. 

1992లో ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ పేర్కొంది. ఆ సమయంలో తీవ్ర విధ్వంసం జరిగినట్లు తెలిపింది. 

రెండో సారి వచ్చిన భూకంపం.. పశ్చిమ సుమత్రా దీవులు, పడాంగ్ ఏరియాల్లో రావడంతో సునామీ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు జియోఫిజిక్స్ కేంద్రం తెలిపింది. 

 సముద్రగర్భంలో సంభవించిన ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలు లేదా ఇతర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు ఉండదు అని ఆస్ట్రేలియా సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది.

ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్  అనే భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో ఉంది. ఇక్కడ భూపటలంలోని వివిధ ఫలకాలు కలవడం వల్ల.. అవి మార్పులు చేసుకుంటుండటం వలన పెద్ద సంఖ్యలో భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడతాయని సంస్థ పేర్కొంది. .

©️ VIL Media Pvt Ltd.