Reading Time: 2 minutes

వందేమాతరం వివాదం.. సోనియాగాంధీపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన కాంగ్రెస్.. అసలు అక్కడ ఏం జరిగింది..?

Caption of Image.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఇందిరా భవన్ లో 2026 ఆగస్టు 15న జరిగిన వేడుకల్లో సోనియా గాంధీ వందేమాతరం గీతాన్ని అవమానించారని బీజేపీ చేస్తున్న ప్రచారంపై సీరియస్ కౌంటర్ ఇచ్చింది. ప్రతీ అంశాన్ని రాజీకీయం చేసి.. వివాదం సృష్టించి జనాల దృష్టిని మళ్లించే పనిలోనే ఇప్పటికీ బీజేపీ ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీకి వందేమాతరంతో ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇందిరా భవన్ లో వందేమాతర గీతం పూర్తి గీతాన్ని ఆలపించినట్లు చెప్పారు. కావాలనే బీజేపీ దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు మండిపడ్డారు.

అసలు అక్కడ ఏం జరిగింది..?

బీజేపీ ఆరోపిస్తున్నట్లు అక్కడ వందేమాతర గీతానికి అవమానం జరగలేదని అన్నారు జైరాంరమేష్. వందేమాతర గీతాన్ని జాతికి అంకితం చేసిందే కాంగ్రెస్. తమ పార్టీ అంకిత భావం ఏంటో బీజేపీకి చరిత్ర ద్వారా చెబుతామని అన్నారు.

కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే చాలా సేపటి నుంచి నిలుచున్నారు. ఆయనకు కుర్చీ వేయాల్సిందిగా సోనియా గాంధీ అక్కడున్నవారిని కోరారు. పర్లేదు అని ఖర్గే అనటం.. రాహుల్ గాంధీ కూడా కల్పించుకుని చైర్ వేయాల్సిందిగా కోరటం.. అక్కడ జరిగిందనిఅన్నారు. ఇంతలా దిగజారి దుష్ప్రచారానికి దిగటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 

వందేమాతర గీదాన్ని జాతికి అంకితం చేసిందే కాంగ్రెస్..

వందే మాతర గీతాన్ని జాతికి అంకితం చేసిందే కాంగ్రెస్ అని ఈ సందర్భంగా జైరామ్ రమేష్ అన్నారు. 1937లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తొలిసారి వందేమాతర గీతం ఆలపించినట్లు చెప్పారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయి పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహార్ లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్, సీ రాజగోపాలాచారి వంటి స్వాతంత్ర్య సమరయోధులు.. గురుదువ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు వందేమాతర గీతాన్ని ఆలపించి జాతికిఅంకితం చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ సమావేశాల్లో వందేమాతర గీతంతోనే సమావేశాలు ప్రారంభం కావాలని నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లకు ఠాగూర్ చెప్పినట్లు తెలిపారు. 

అప్పట్నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశాల్లో వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ వందేమాతర గీతాన్ని అవమానించిందని బీజేపీ చెప్పడం మరీ హాస్యాస్పదం అని ఎద్దేవా చేవారు. 

ఇందిరా భవన్ లో పూర్తి గీతాన్ని పాడినట్లు తెలిపారు. పార్లమెంటులో 16 గంటల పాటు దీనిపై చర్చజరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ గీతం వెనుక ఉన్న మొత్తం చరిత్రను చెప్పాను. మోదీకి, ఆయన భక్తులకు చరిత్ర తెలియదు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలకు వందే మాతరం గీతం ఏ సందర్భంలో వచ్చిందో తెలుస్తుందని భావిస్తున్నానని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.