
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీన కాకినాడలో స్వాతంత్ర దినోవత్స వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి రాజమండ్రి చేరుకున్నారు. జ్వరం ఎక్కువగా ఉండటంతో.. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళుతున్నట్లు ప్రకటించింది ఆయన ఆఫీస్. జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ కు.. రాజమండ్రిలో డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు.
షెడ్యూల్ ప్రకారం కాకినాడ వేడుకల తర్వాత.. విజయవాడలో గవర్నర్ ఇచ్చే ఎట్ హోం విందులో పాల్గొనాల్సి ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఎట్ హోం పేరుతో విందు ఇవ్వటం ఆనవాయితీ. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ వేడుకలో పాల్గొనాల్సి ఉన్నా.. తీవ్రమైన జ్వరం కారణంగా రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలో ఆపరేషన్ జరిగింది. అనంతరం డాక్టర్ల సూచనలతో ఫిజియో థెరపీ చేయించుకుంటున్నారు. విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చే ఎట్ హోం విందులో సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు అందరూ హాజరుకానున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర జ్వరం కారణంగా ఈ సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించే “ఎట్ హోమ్” కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో…
— JanaSena Party (@JanaSenaParty) August 15, 2026