Reading Time: < 1 minute

ట్వీట్లతో స్వాధీనం చేసుకోలేరు.. హార్ముజ్ మా కంట్రోల్ లోఉంది: ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

Caption of Image.

హార్ముజ్ జలసంధిలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. హార్ముజ్ ను స్వాధీనం చేసుకున్నామంటూ ట్వీట్లు చేయడం తప్పా అమెరికా చేసేదేమీ లేదని ఇరాన్ కౌంటరిచ్చింది. హార్ముజ్ త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని  ట్రంప్ చేసిన వ్యాఖ్యలను  ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఇరాన్ దేనని ప్రకటించింది. 

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హార్ముజ్ పై అటు అమెరికా, ఇటు ఇరాన్ మాటల యుద్దం కొనసాగుతున్న క్రమంలో.. ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది  ఓ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ గతంలోనూ, ఇప్పుడు, భవిష్యత్తులోనూ ఇరాన్ దే.. సైనిక శక్తితో, రాజకీయ ప్రకటనతో అమెరికా దానిని స్వాధీనం చేసుకోలేరని అన్నారు. హార్ముజ్ పై ట్రంప్  చేసిన స్వాధీన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. 

ఇదిలా ఉంటే.. శుక్రవారం హార్ముజ్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ను ఓడించి త్వరలోనే హార్ముజ్ ను  అమెరికా భూభాగంలో కలిపేస్తామని  అన్నారు. ఇరాన్ ను ఓడించేందుకు అమెరికన్లు కొంత చెల్లించాల్సి రావచ్చని అన్నారు ట్రంప్.

©️ VIL Media Pvt Ltd.