Reading Time: < 1 minute
Bjp Mp Nishikant Dubey Shares Nehru Photos Amid Rahul Gandhi Hug Row Congress Hits Back

BJP:  రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శించే క్రమంలో, ప్రధాని నరేంద్రమోడీ విదేశాధినేతల్ని ఆలింగనం చేసుకోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘విదేశీ నేతల్ని కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను కౌగిలించుకుని, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ ‘‘హగ్’’ వ్యాఖ్యల వ్యవహారం తిరిగి కాంగ్రెస్‌కే ఎదురుదెబ్బగా మారింది. బీజేపీ నేతలు ఇందిరాగాంధీ గతంలో విదేశీ నేతల్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తన ఎక్స్ అకౌంట్‌లో నెహ్రూకు సంబంధించిన పలు పాత ఫొటోలను పోస్ట్ చేశారు. “నా లైబ్రరీలోని నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధించిన ఓ పుస్తకంలోని కొన్ని చిత్రాలు” అంటూ ఆయన పేర్కొన్నారు. హ్రూ తన సోదరి విజయలక్ష్మి పండిట్, మేనకోడలు నయనతార సహగల్, అమెరికా మాజీ ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీతో ఉన్న చిత్రాలు ఉన్నాయి.

అయితే, దూబే వీనిటి నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలని నేరుగా పేర్కొననప్పటికీ, నెహ్రూ మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు చూపించే ఉద్దేశంతోనే వాటిని పోస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ స్పందిస్తూ.. నెహ్రూ ఫోటోలు అసలు సందర్భం నుంచి విడదీసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఫోటోలో ఒక ఫొటోలో నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఆయన చెంపపై ముద్దు పెడుతున్నారని, మరో ఫొటోలో ఆయన మేనకోడలు నయనతార సహగల్ ఉన్నారని ఆమె వివరించారు. 1962 మార్చిలో తీసిన మరో ఫొటోలో హోలీ సందర్భంగా జాక్వెలిన్ కెన్నెడీకి నెహ్రూ రంగులు పూస్తున్నట్లు ఉందని సుప్రియా శ్రినేత్ తెలిపారు.

గురువారం క్రియేటివ్ కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్‌లు ఆలింగనం చేసుకుని ప్రధాని మోడీపై వ్యంగ్యంగా స్పందించారు. ఈ సమయంలోనే సందీప్ దీక్షిత్, రాహుల్ గాంధీతో ‘‘నన్ను మెలోనీ అనుకోలేదుగా?’’ అని ప్రశ్నించగా, రాహుల్ గాంధీ ‘‘నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు’’ అని బదులిచ్చారు. దీని తర్వాత బీజేపీ ఇందిరా గాంధీ-ఫిడెల్ కాస్ట్రో, ఇందిరా గాంధీ-యాసర్ అరాఫత్ ఫొటోలను కూడా షేర్ చేసింది.