
బంగారం, డ్రగ్స్ వంటివి బాడీ లోపల దాచి తీసుకొచ్చే దృశ్యాలను మనం ఇప్పటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. ఇవన్నీ రియల్ లైఫ్‌లో సాధ్యం కావు అని అనుకుంటాం. అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే తాజాగా అలాంటి ఘటన ఒకటి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు బంగారాన్ని ముద్దగా మార్చి తన మలద్వారంలో దాచి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఎయిర్ చెకింగ్ సమయంలో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
మలద్వారంలో అరకేజీ బంగారం!
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో సర్ఫరాజ్ మాలా అనే 24 ఏళ్ల యువకుడు జెడ్డా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. టెర్మినల్ నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో చెకింగ్ వద్ద అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు మెటల్ డిటెక్టర్‌తో స్కాన్ చేయగా షాకింగ్ విషయం బయటకొచ్చింది. అతను తన మలద్వారంలో బంగారాన్ని కడ్డీగా మార్చి దాచి తరలిస్తున్నట్టు గుర్తించారు.
రూ.65.69 లక్షల విలువైన బంగారం స్వాధీనం!
దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని వైద్యుల సహాయంతో మలద్వారంలో దాచి తరలిస్తున్న బంగారాన్ని బయటకు తీశారు. సుమారు 467.09 గ్రాములు (దాదాపు అరకిలో) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్‌లో రూ.65.69 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
₹65 Lakh Gold Seized at Ahmedabad Airport | Major Customs Action | TV9Gujarati#AhmedabadAirport #Ahmedabad #GoldSeized #GoldSmuggling #GoldSmugglingCase #Customs #CustomsDepartment #AIU #AhmedabadCustoms #GoldSeizure #GoldCase #AhmedabadNews #TV9Gujarati pic.twitter.com/4ztq8H6Wh9
— Tv9 Gujarati (@tv9gujarati) August 9, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.