Reading Time: 2 minutes
Naga Durga: హీరోయిన్‌ ఛాన్స్ ఇస్తే మాకే 15 కండిషన్లు పెట్టింది.. నాగదుర్గపై బన్నీవాసు కామెంట్స్ వైరల్

నాగదుర్గ.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫోక్‌ సాంగ్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార. ఈ బ్యూటిఫుల్ సింగర్ డ్యాన్స్‌లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అమ్మడి నుంచి సాంగ్‌ చేస్తే చాలు యూట్యూబ్ షేక్ అవుతుంది. మిలియన్ ఫ్యూస్ తో రికార్డులు బద్దలవుతాయి. ఇలా తన పాటలు, డ్యాన్సులతో తెలుగు నాట బోలెడు క్రేజ్ సొంతం చేసుకున్న నాగదుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పైనా మెరవనుంది. ఇప్పటికే ఈ అందాల తార ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ క్రేజీ ప్రాజెక్టులో నాగదుర్గ కథానాయికగా చేస్తోంది. ఇప్పుడీ ఫోక్ సింగర్‌కు తెలుగు సినిమా లోనూ అవకాశం వచ్చింది.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ సింగర్‌కు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో వంశీ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌ను ఫిక్స్ ఖరారు చేశారు.

అయితే ఈ సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ లో హీరోయిన్ నాగ దుర్గపై నిర్మాత బన్నీ వాస్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ‘నాగదుర్గను నేను పిలిచి మా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తే నాకే 15 రూల్స్ పెట్టింది. అప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే.. నేను తనను డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తే ఇంత క్లారిటీగా ఉంటుందా అనే ఫీలింగ్ కలిగింది. నేను ఏం చెయ్యగలను, ఏం చెయ్యలేను అంత క్లారిటీగా చెప్పింది. నాగదుర్గను చూసి అప్పుడు అనిపించింది నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తున్నా అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం. ఎందుకంటే నాగదుర్గ ఈ సినిమాకు అంత ఇంపార్టెంట్’ అని చెప్పుకొచ్చారు బన్నీ వాసు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇడుపు కాయితం ఈవెంట్ లో ప్రియదర్శి, నాగదుర్గ.. వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Bunny Vas Works (@bvworksoffl)

 

View this post on Instagram

 

A post shared by Bunny Vas Works (@bvworksoffl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.