Reading Time: 2 minutes

జర భద్రం! వాన చినుకులతో పాటు వచ్చే ఆ 7 రోగాలు ఇవే.. డాక్టర్ల హెచ్చరిక!

Caption of Image.

ఎండ వేడి నుండి వర్షాలు రిలీఫ్  ఇచ్చిన.. ఈ కాలంలో రకరకాల జబ్బులు పెరిగే ఛాన్స్ ఎక్కువే. రోడ్లపై నీరు నిలవడం, గాలిలో తేమ పెరగడం వల్ల దోమలు, బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ నేపథ్యంలో, మనం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో  డాక్టర్ హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే 7 ముఖ్యమైన వ్యాధుల వివరాలు ఇవే:

  దోమల ద్వారా వచ్చే వ్యాధులు
1. డెంగ్యూ జ్వరం (Dengue)
డెంగ్యూ జ్వరం ఎలా వస్తుందంటే ఇళ్ల చుట్టుపక్కల నిలిచి ఉండే మంచి నీటిలో పెరిగే ‘ఈడిస్’ దోమల కాటు వల్ల వస్తుంది. దీని లక్షణాలు తీవ్రమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కండరాలు-కీళ్ల నొప్పులు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. పరిస్థితి విషమిస్తే ప్లేట్‌లెట్స్ పడిపోయి ప్రాణాంతకంగా మారవచ్చు.

జాగ్రత్తలు: నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు, దోమల నివారణ మందులు వాడటం చాలా ముఖ్యం.

2. మలేరియా (Malaria)
మలేరియా  ఎలా వస్తుందంటే నిలిచిపోయిన మురికి నీటి గుంటల్లో పెరిగే ‘అనోఫిలస్’ అనే ఆడ దోమల ద్వారా  వ్యాపిస్తుంది. దీని లక్షణాలు చూస్తే చలితో విపరీతమైన జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, అలసట, రక్తం తగ్గడం జరుగుతాయి. 

జాగ్రత్తలు: గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వీలైతే దోమల లార్వాలను తినే చేపలను నీటి గుంటల్లో వదలడం మంచిది.

3. చికున్‌గున్యా (Chikungunya)
చికున్‌గున్యా ఎలా వస్తుందంటే ఇది కూడా ‘ఈడిస్’ దోమల ద్వారానే వ్యాపిస్తుంది. దీని లక్షణాలు తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం, ఒంటిపై వాపులు వస్తాయి. ఈ కీళ్ల నొప్పులు కొన్ని వారాల నుండి నెలల తరబడి వేధిస్తాయి.

ALSO READ : రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..

జాగ్రత్తలు: దోమలు కుట్టకుండా రక్షణ చర్యలు తీసుకోవడం, దోమల సంతానోత్పత్తిని అరికట్టడం ఒక్కటే మార్గం.

 కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు

4. లెప్టోస్పిరోసిస్ ( Leptospirosis)
లెప్టోస్పిరోసిస్ ఎలా వస్తుందంటే  ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ఎలుకలు, కుక్కలు వంటి జంతువుల మూత్రంతో కలుషితమైన నీరు లేదా మట్టి ద్వారా  వస్తుంది. చర్మంపై ఉండే చిన్న గాయాల ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. దీని లక్షణాలు  విపరీతమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు. నిర్లక్ష్యం చేస్తే కామెర్లు లేదా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు పాడవుతాయి.

జాగ్రత్తలు: వరద నీటిలో నడవకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కాళ్లకు సేఫ్టీ బూట్లు  వేసుకోవాలి.

5. టైఫాయిడ్ జ్వరం (Typhoid)
టైఫాయిడ్ ఎలా వస్తుందంటే  సాల్మొనెల్లా టైఫై అనే బ్యాక్టీరియా వల్ల కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా వస్తుంది. దీని  లక్షణాలు చాలా రోజుల పాటు తగ్గని తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, విపరీతమైన నీరసం ఇంకా  తలనొప్పి.

జాగ్రత్తలు: ఎప్పటికప్పుడు వేడి వేడి ఆహారం తినడం, కాచి చల్లార్చిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగడం.

6. కలరా (Cholera)
కలరా ఎలా వస్తుందంటే   కలుషిత నీరు లేదా ఈగలు వాలిన ఆహారం తినడం ద్వారా ‘విబ్రియో కలరే’ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీని లక్షణాలు విపరీతమైన నీళ్ల విరేచనాలు, వాంతులు. దీనివల్ల శరీరంలోని నీరంతా పోయి (Dehydration) మనిషి త్వరగా నీరసించిపోతాడు.

జాగ్రత్తలు: పరిశుభ్రమైన తాగునీరు, ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం.

7. హెపటైటిస్ A (లివర్ ఇన్ఫెక్షన్ / Hepatitis A)
హెపటైటిస్ A ఎలా వస్తుందంటే   వర్షాల వల్ల మురికినీరు తాగునీటిలో కలవడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా కాలేయానికి (లివర్) ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీని లక్షణాలు కామెర్లు (కళ్లు, గోళ్లు పచ్చగా మారడం), తీవ్రమైన అలసట, వాంతులు కావడం, కడుపులో అసౌకర్యం.

జాగ్రత్తలు: బయటి ఆహారానికి దూరంగా ఉండటం, నీటిని బాగా మరిగించి తాగడం.

 వర్షాకాలంలో సురక్షితంగా ఉండటానికి  డాక్టర్ల చిట్కాలు
వ్యాధి వచ్చాక బాధపడటం కంటే, రాకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గం డాక్టర్లు సూచిస్తున్నారు:

పరిసరాల పరిశుభ్రత: ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్లు, పాత టైర్లు, కుండీలలో నీటిని ఎప్పటికప్పుడు తీసేయాలి.

వ్యక్తిగత పరిశుభ్రత: భోజనానికి ముందు, బయటి నుండి వచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

ఆహార జాగ్రత్తలు: ఎప్పుడూ వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలి. రోడ్డు పక్కన అమ్మే తెరిచి ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు.

 జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి ఏ చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సొంత వైద్యం అస్సలు చేసుకోకూడదు.

©️ VIL Media Pvt Ltd.