Reading Time: 2 minutes

తాళి కట్టే వేళ కన్నీటి పర్యంతమైన జబర్దస్త్ ఫైమా.. ప్రవీణ్ నాయక్‌తో సాంప్రదాయబద్ధంగా వివాహం!

Caption of Image.

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించే జబర్దస్త్ ఫైమా (Faima) తన రియల్ లైఫ్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అందరికీ షాకిచ్చింది.  ఇప్పుడు పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్‌ను ఆమె పెళ్లాడింది.

తొమ్మిదేళ్ల ప్రేమ..

ఫైమా, ప్రవీణ్‌ గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కేవలం ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ దాటుకుని ఈ జంట ఒక్కటైన వేళ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా తమ వివాహం వీడియోలను, ఫోటోలను షేర్ చేసింది. మొదట రిజిస్టర్ ఆఫీస్‌లో సింపుల్‌గా సంతకాలు పెట్టేసి దండలు మార్చుకుంది ఈ జంట. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా హల్దీ వేడుకలు, పెళ్లి వేడుకలను జరుపుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FAIMA (@faima_patas)

 

తాళి కట్టే వేళ.. ఏడ్చేసిన ఫైమా..

లేటెస్ట్ గా ఫైమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెడ్డింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పసుపు రంగు బట్టల్లో హల్దీ వేడుకలో ఇద్దరూ ఎంతో ముచ్చటగా కనిపించారు. ఆ తర్వాత జరిగిన ప్రధాన కల్యాణంలో ప్రవీణ్.. ఫైమా మెడలో మూడు ముళ్లు వేస్తుండగా ఆమె తన భావోద్వేగాలను అస్సలు ఆపుకోలేకపోయింది. తొమ్మిదేళ్ల నిరీక్షణ, పడ్డ కష్టాలన్నీ కళ్లముందు కదలాడటంతో ఫైమా కన్నీటి పర్యంతమైంది. ఆనందభాష్పాలతో ఏడుస్తున్న భార్యను చూసి ప్రవీణ్ ఎంతో ప్రేమగా ఓదార్చాడు.

►ALSO READ | Naveen Polishetty: ఇది కదా ఫ్రేమ్ అంటే! నవీన్ పోలిశెట్టి రూ.5 వేల కోట్ల కాస్ట్లీయెస్ట్ రీల్ వైరల్!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FAIMA (@faima_patas)

 

సెలబ్రిటీల విషెస్.. 

ఈ వీడియోలు, ఫోటోలు చూసిన పలువురు జబర్దస్త్ కమెడియన్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, టాలీవుడ్ స్టార్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫైమా.. నీ ప్రేమ నిజమైంది అంటూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండి, ఇప్పుడు ఒక ఇంటిదైన ఫైమాను చూసి ఆమె అభిమానులు సైతం విషెస్ తెలుపుతున్నారు. నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట అంటూ కామెంట్లు పెడుతున్నారు.  ప్రస్తుతం వీరి వెడ్డింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FAIMA (@faima_patas)

 

©️ VIL Media Pvt Ltd.