Reading Time: < 1 minute
Ram Charan Rc17 Movie Release Postponed To 2028 Sukumar Script Delay Reasons

మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను పక్కన పెడితే, ‘పెద్ది’ రిలీజ్ వరకు ‘రంగస్థలం’ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ హిట్ కాంబో రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’తో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాడు సుకుమార్. ‘గేమ్ చేంజర్’, ‘పెద్ది’ హిందీలో రిలీజ్ అయినా హిట్ కాలేదు. సుకుమార్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

‘పెద్ది’ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో సుకుమార్ మైక్ తీసుకోగానే రామ్ చరణ్ మూవీ గురించి చెప్పాలంటూ అభిమానులు గోల చేశారు. లెక్కల మాస్టారి లెక్కలు ఏమిటో గానీ, చెప్పడానికి నిరాకరించారు. RC 17 గురించి ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. RC 17 గురించి సుకుమార్ పెదవి విప్పకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో చాలా కథలు అనుకున్నా ఒక్కటి సెట్ కాలేదు, ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్న డైరెక్టర్ ను సినిమా గురించి అడిగితే ఏం చెబుతాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ తో పెట్టుకుంటే రెండు మూడేళ్ళు ఈజీగా గడిచిపోతాయి. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాదిన్నర అయింది, ఇంతవరకు రామ్ చరణ్ మూవీ కథ ఫైనల్ కాలేదు. కథను చెక్కి చెక్కి బౌండెడ్ స్క్రిప్ట్ రాయడానికి ఇంకో నాలుగైదు నెలలు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కన దసరా తర్వాతే సినిమా సెట్స్ పైకి వచ్చేది. ఇక మూవీ పూర్తి కావడానికి రెండేళ్ళు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే సినిమా 2028 డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.