
NCERT తొలిసారి నైన్త్ క్లాస్ సెలబస్ లో 1975 ఎమర్జెన్సీ అంశాన్ని చేర్చింది. అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ అనే కొత్త బుక్ లో ఎమర్జెన్సీ కాలాన్ని ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితిగా అభివర్ణించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ అంశాన్ని విద్యార్థుల పాఠ్యాంశాలలో చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పుస్తకం ప్రకారం..1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ సమయంలో దేశ ప్రజల ప్రాథమిక హక్కులు రద్దుచేశారు. మీడియాలపై ఆంక్షలు విధించారు. అనేక మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడంతోపాటు అనేక నిర్భంధచర్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని ఆ బుక్ లో వివరించింది.
►ALSO READ | తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు స్వల్ప ఊరట
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రను కూడా పుస్తకం ప్రస్తావించింది. ఆయన నాయకత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారని తెలిపింది. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించగా, ప్రజలు తమ ఓటుతో ప్రభుత్వాన్ని మార్చారని గుర్తు చేసింది.
దీంతోపాటు “ప్రజాస్వామ్యం-మీరు” అనే కొత్త విభాగాన్ని చేర్చి ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యతలు, పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. మీడియాను ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా పేర్కొంటూ దాని ప్రాధాన్యాన్ని వివరించింది. భారత ప్రజాస్వామ్య బలం, ఓటర్ల భాగస్వామ్యం, స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం వంటి అంశాలను కూడా ఈ కొత్త సిలబస్‌లో చేర్చారు.