
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ నలుమూలలా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2023 లోనూ ఇక్కడ భారీ అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదే పదే ఇక్కడే ప్రమాదాలు జరుగుతుండటంతో… భద్రతా ప్రమాణాల పాటించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.