
INDW vs BANW: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు (జూన్ 25, గురువారం) మాంచెస్టర్‌లోని ప్రతిష్టాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో బంగ్లాదేశ్‌తో తమ నాలుగో లీగ్ మ్యాచ్ ఆడనుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఊహించని ఓటమి ఎదురవడంతో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. దీంతో సెమీస్ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్‌పై భారత్ ఖచ్చితంగా భారీ విజయం సాధించాల్సి ఉంది.
మూడు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు:
గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన టీమిండియా.. పాకిస్తాన్‌పై 64 పరుగులు, నెదర్లాండ్స్‌పై 95 పరుగుల భారీ విజయాలతో అద్భుతంగా టోర్నీని ప్రారంభించింది. కానీ, సౌతాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ జట్టు 19.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ప్రస్తుతం ఇండియా 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో +2.511 నెట్ రన్ రేట్‌తో ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే:
ఇండియన్ టీమ్ సెమీఫైనల్స్ చేరాలంటే.. తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ (జూన్ 25), ఆస్ట్రేలియా (జూన్ 28) జట్లను ఖచ్చితంగా ఓడించాలి.. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ ఓడినా భారత్ టోర్నీ నుంచి దాదాపు అవుట్ అయినట్లే.. కేవలం హర్మన్ సేన గెలిస్తేనే సరిపోదు.. సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కదానిలోనైనా ఓడిపోవాల్సి ఉంది. ఒకవేళ భారత్.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై గెలిచి.. సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై గెలిస్తే.. అప్పుడు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మూడు జట్లూ తలా 8 పాయింట్లతో సమంగా నిలుస్తాయి.
నెట్ రన్ రేట్ కీలకం:
ఒకవేళ పైన పేర్కొన్నట్లు మూడు జట్లూ 8 పాయింట్లతో టై అయితే, అప్పుడు సెమీస్ బెర్త్‌లను నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతానికైతే భారత్ రన్ రేట్ (+2.511), సౌతాఫ్రికా (-0.546) కంటే చాలా మెరుగ్గా ఉండటం టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
ALSO READ : వరల్డ్ కప్కి కొత్త టీం!.. రోహిత్, కోహ్లీ ఆడేది డౌటే?
టీమిండియా స్క్వాడ్:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తికా భాటియా, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్, నందిని శర్మ, శ్రీ చరణి.