Reading Time: < 1 minute
Mamata Banerjee New X Bio After Bengal Election Defeat

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఏర్పడింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సమా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించిన ఒక వార్త హైలెట్ అవుతోంది. ఓడిపోయినా, ఆమె ఓటమిని అంగీకరించలేదని తెలుస్తోంది.

Read Also: Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ

శనివారం ఉదయం 11 గంటలకు ఆమె ఎక్స్ బయోలో ‘‘గౌరవనీయ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్’’ అని పేర్కొంది. సువేందు అధికారి బెంగాల్ సీఎం అయిన తర్వాత కూడా ఆమె తన బయోలో మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా ‘‘ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసన సభలు) అని మార్చారు. అంతేకాకుండా తన బయోలో తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పేర్కొన్నారు. అధికారం పోయినప్పటికీ ఆమె తన బయోలో ‘‘మాజీ సీఎం’’ అని చేర్చడానికి ఇష్టపడలేదు.

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది యూజర్లు ఎక్స్ నుంచి ఆమె బయోను మార్చాలని ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేస్తున్నారు. మరికొందరు ఆమె అకౌంట్ నిలిపేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. చివరకు గవర్నర్ ఆమె ప్రభుత్వాన్ని డిస్‌మిస్ చేశారు. ఇప్పుడు ఆమె బయోలో కూడా ‘‘హానరబుల్ సీఎం’’ అనే పదాలను ఉపయోగించారు.