“మోదీని తిట్టారు.. సువర్ణావకాశం పాడుచేసుకున్నారు!” పాక్ ప్రధాని సలహాదారు సంచలన వ్యాఖ్యలు!

పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో భారత్-పాక్ దౌత్య సంబంధాల చరిత్రలో దిగ్భ్రాంతికరమైన ఘట్టం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌కు అత్యంత సన్నిహిత సలహాదారు అయిన రాణా సనావుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలను ప్రశంసిస్తూనే, ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడానికి పాకిస్తాన్ నాయకులే కారణమంటూ ఆయన స్వయంకృతాపరాధాన్ని అంగీకరించారు.
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ‘సమా టీవీ’ (Samaa TV) టాక్ షోలో రాణా సనావుల్లా ఖాన్ మాట్లాడుతూ, భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పుకోవడానికి పాకిస్తాన్‌కు గతంలో ఒక అద్భుతమైన అవకాశం లభించిందని గుర్తుచేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీని గుడ్డిగా వ్యతిరేకించాలనే రాజకీయ అజెండా కారణంగానే పాకిస్తాన్ తన సువర్ణావకాశాలన్నింటినీ చేజేతులా కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ రోజు మనం భారత్‌తో మాట్లాడాలని చూస్తున్నా, మోదీ మన ఫోన్ కాల్స్, పిలుపులకు సమాధానం ఇవ్వడం లేదంటే దానికి పూర్తి బాధ్యత మనదే” అని ఆయన కుండబద్దలు కొట్టారు.
2015 ప్రధాని మోదీ లాహోర్ పర్యటన ప్రస్తావన!
ఈ సందర్భంగా 2015లో ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో పర్యటించిన ఉదంతాన్ని సనావుల్లా పరోక్షంగా ప్రస్తావించారు. అప్పట్లో నవాజ్ షరీఫ్ ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు సరైన వాతావరణాన్ని సృష్టించారని, కానీ పాకిస్తాన్ దానిని నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. ప్రస్తుతం ఇస్లామాబాద్, న్యూఢిల్లీల మధ్య ‘ట్రాక్ 2’ రహస్య , పరోక్ష దౌత్య సంప్రదింపులు జరుగుతున్నాయా అని యాంకర్ ప్రశ్నించగా.. ఆయన అవునని అంగీకరించారు. రెండు దేశాల మధ్య తెరవెనుక చర్చలు ఎప్పుడూ పూర్తిగా ఆగలేదని ఆయన వెల్లడించారు. “మోదీ మీ కాల్స్ తీయడం లేదు, ఆయన మౌనంగా ఉన్నారు.. రేపు మనపై క్షిపణి దాడి జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి బలమైన నాయకుడు మన ఇంటికి (లాహోర్ పర్యటనకు) వచ్చినప్పుడు మీరు ఆయనను తిట్టిపోశారు. ఇప్పుడు ఆయన ఎందుకు సమాధానం ఇస్తారు?” అంటూ పాక్ విపక్షాల తీరుపై సనావుల్లా మండిపడ్డారు.
ఐఎంఎఫ్ భిక్ష అడగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు!
గతంలో జరిగిన తప్పుల నుంచి పాకిస్తాన్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, కేవలం సమయాన్ని వృధా చేసుకుంటూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ 2015 నాటి శాంతి వాతావరణాన్ని పాకిస్తాన్ అలాగే కొనసాగించి ఉంటే, ఈ రోజు ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడమే కాకుండా పాక్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. భారతదేశంతో సత్సంబంధాలు ఉండి ఉంటే, ఈ రోజు పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ముందు అప్పుల కోసం భిక్షా పాత్ర పట్టుకుని నిలబడాల్సిన దుస్థితి వచ్చేది కాదని రాణా సనావుల్లా ఖాన్ కుండ బద్దలు కొట్టారు. తాజాగా రాణా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ పాలకుల అసమర్థతను నిలదీసేలా ఉన్నాయి.
Pak PM’s Sp Assistant: Modi gave us a friendly chance to prosper (2015 visit) but we refused. Now we live in fear of his Brahmos. He doesn’t pick our calls. Now it’s too late for us.pic.twitter.com/TValJuZ1DJ
— Pakistan Untold (@pakistan_untold) July 10, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..