July 11, 2026

3 నెలల్లో 20 కేజీల బరువు తగ్గాలా ? జిమ్‌, డైటింగ్ లొల్లి లేకుండా నిపుణులు చెప్తున్న 7 సూత్రాలు ఇవే!

3 నెలల్లో 20 కేజీల బరువు తగ్గాలా ? జిమ్‌, డైటింగ్ లొల్లి లేకుండా నిపుణులు చెప్తున్న 7 సూత్రాలు ఇవే!
Reading Time: 2 minutes

3 నెలల్లో 20 కేజీల బరువు తగ్గాలా ? జిమ్‌, డైటింగ్ లొల్లి లేకుండా నిపుణులు చెప్తున్న 7 సూత్రాలు ఇవే!

Caption of Image.

బరువు తగ్గడం అనేది ఒక మ్యాజిక్ కాదు. చాలా మంది మొదట్లో ఉత్సాహంగా డైటింగ్ స్టార్ట్ చేస్తారు.. నాలుగైదు కిలోలు తగ్గగానే బరువు పెరగడం, తగ్గడం ఆగిపోయి ఒకే దగ్గర ఆగిపోతుంది. దాంతో విసుగు వచ్చి మధ్యలోనే ఆశలు వదిలేస్తుంటారు.

అయితే, ఎలాంటి షార్ట్‌కట్లు వెతకకుండా, క్రాష్ డైటింగ్‌లు చేయకుండా కేవలం 3 నెలల్లో 20 కేజీల వరకు బరువు తగ్గే ఒక అద్భుతమైన 7-స్టెప్స్ ప్లాన్‌ను ప్రముఖ న్యూట్రిషనిస్ట్  సోషల్ మీడియాలో షేర్ చేశారు. 90 రోజుల పాటు ఈ సింపుల్ లైఫ్‌స్టైల్ మార్పులను తప్పకుండ పాటిస్తే రిజల్ట్ కచ్చితంగా కనిపిస్తుంది. ఆ ఏడు సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:

1. క్యాలరీ లోటు 
బరువు తగ్గడానికి మొదటి సూత్రం.. బాడీకి అవసరమైన దానికంటే కాస్త తక్కువ క్యాలరీల ఫుడ్ తీసుకోవడం. అయితే దీని అర్థం లంచ్, డిన్నర్ మానేసి ఆకలితో అల్లాడిపోవడం కాదు. మీరు రోజూ ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ తింటూ, హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే  శరీరం ఆటోమేటిక్‌గా నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం స్టార్ట్ చేస్తుంది.

2. ప్రోటీన్ ఫుడ్ పెంచండి  
మీ ప్లేట్‌లో ప్రోటీన్ అంటే పప్పులు, పనీర్, గుడ్లు, చికెన్ వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా తింటే కడుపు త్వరగా నిండుతుంది, ఎక్కువ సమయం ఆకలి వేయదు. అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గే ప్రాసెస్‌లో బాడీలోని కండరాలు కరిగిపోకుండా, కేవలం ఫ్యాట్ (కొవ్వు) మాత్రమే కరిగేలా ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది.

3. రోజూ 8వేల నుండి 12వేల అడుగులు 
శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా క్యాలరీలను కరిగించడానికి నడకను మించిన సులభమైన మార్గం లేదు. జిమ్‌కి వెళ్లి గంటలు గంటలు కష్టపడలేకపోయినా.. రోజు మొత్తం మీద 8 వేల నుండి 12 వేల అడుగులు నడిచేలా టార్గెట్ పెట్టుకోండి. ఇది మీ మెటబాలిజాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.

4. స్ట్రెంత్ ట్రైనింగ్ 
వారంలో కనీసం 4 నుండి 5 రోజులు కాస్త వెయిట్స్ ఎత్తడం లేదా బాడీ వెయిట్ ఎక్సర్‌సైజులు (పుషప్స్, స్క్వాట్స్ వంటివి) చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. ఒంట్లో కండరాల శాతం పెరిగితే, మనం ఖాళీగా కూర్చున్నా కూడా బాడీ ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది.

5. లిక్విడ్ క్యాలరీలకు బై-బై 
మనం తెలియకుండానే కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్‌లు, షుగర్ ఎక్కువగా ఉండే కాఫీ, టీల రూపంలో వందల క్యాలరీలను బాడీలోకి పంపించేస్తుంటాం. వీటివల్ల కడుపు నిండదు కానీ ఒంట్లో కొవ్వు మాత్రం పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి పంచదార పానీయాలను పూర్తిగా పక్కన పెట్టేయండి.

6. రోజు తప్పకుండ అలవాటు
బరువు తగ్గడంలో టైమింగ్స్ చాలా ముఖ్యం. రోజుకో సమయానికి తినడం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం అస్సలు వద్దు. ప్రతిరోజూ దాదాపు ఒకే సమయానికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయండి. అలాగే రాత్రిపూట కరెక్ట్ టైమ్‌కి పడుకుని 7-8 గంటల నిద్రపోయేలా చూసుకోండి.

7. ప్రతి వారం ప్రోగ్రెస్ చెక్ చేసుకోండి
రోజూ పొద్దున్నే వెయిట్ మెషిన్ ఎక్కి బరువు చూసుకుని టెన్షన్ పడకండి. ఎందుకంటే బాడీ వెయిట్ రోజురోజుకి మారుతూ ఉంటుంది. దానికి బదులు వారానికి ఒకసారి మాత్రమే బరువు చూసుకోండి. అలాగే బరువుతో పాటు మీ  నడుము కొలతలు తగ్గుతున్నాయా లేదా అనేది గమనించండి. ఇది మిమ్మల్ని నిరాశపడకుండా, మరింత ఉత్సాహంగా ముందడుగు వేసేలా చేస్తుంది.

కఠినమైన రూల్స్ కాకుండా.. ఈ 7 పద్ధతులను మీ ప్రతిరోజు జీవితంలో భాగంగా మార్చుకుంటే, 3 నెలల్లో మీ పాత లుక్‌ని మార్చేసి సూపర్ ఫిట్‌గా తయారవ్వడం గ్యారెంటీ!

©️ VIL Media Pvt Ltd.