July 11, 2026

ఇలాంటి కూతురు ఎవ్వరికీ ఉండొద్దు.. ఎంతకు తెగించిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

ఇలాంటి కూతురు ఎవ్వరికీ ఉండొద్దు.. ఎంతకు తెగించిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
Reading Time: 2 minutes
ఇలాంటి కూతురు ఎవ్వరికీ ఉండొద్దు.. ఎంతకు తెగించిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

రాజస్థాన్‌ను కుదిపేసిన జైపూర్ ఆయుషి శర్మ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లి నీరజ్ శర్మను కిరాతకంగా హత్య చేసిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆయుషి.. అంతకంటే ముందే తన తండ్రి మరణానికి కూడా కారణమైందనే సంచలన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆస్తి, ఉద్యోగంపై వ్యామోహంతో కన్న తండ్రికి వైద్యం అందకుండా చేసి చంపేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి సోదరుడు రాకేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుషి తండ్రి విజయ్ శర్మ రాజస్థాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్‌గా పనిచేసేవారు. 2024లో ఆయన బ్రెయిన్ సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తర్వాత కోలుకుంటున్న సమయంలో.. మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పి ఆయుషి తండ్రిని వేరే చోటికి తీసుకెళ్లింది.

3 నెలలు సీక్రెట్‌గా..

దాదాపు మూడు నెలల పాటు తండ్రిని ఎక్కడ ఉంచిందో ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత జైపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో 2025 ఏప్రిల్‌లో విజయ్ శర్మ మరణించారు. ప్రణాళిక ప్రకారమే తండ్రికి సరైన వైద్యం అందకుండా చేసి ఆయుషి ఆయన్ని చంపేసిందని రాకేష్ శర్మ కోర్టును ఆశ్రయించారు.

తల్లిపై ఎందుకంత పగ

తండ్రి మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ఆ ప్రభుత్వ ఉద్యోగం ఆయుషికి కాకుండా ఆమె తల్లి నీరజ్ శర్మకు వచ్చింది. దీనికి తోడు కుటుంబ ఆస్తులన్నీ తన పేరిట రాయాలని ఆయుషి ఒత్తిడి తెచ్చింది. ఆయుషి కంటే ఆమె దివ్యాంగుడైన సోదరుడినే తల్లి నీరజ్ శర్మ ఎక్కువగా ప్రేమించేది. ఇది మనసులో పెట్టుకున్న ఆయుషి.. తల్లిపై తీవ్ర ద్వేషం పెంచుకుంది. తండ్రి ఉద్యోగం తల్లికి రావడంతో, తల్లిని వదిలించుకుంటే ఆ ఉద్యోగం, ఆస్తి రెండూ తనకే వస్తాయని ప్లాన్ వేసింది. ఎల్‌ఎల్‌బీ లాస్ట్ ఇయర్ చదువుతున్న ఆయుషికి చట్టాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా పక్కా వ్యూహంతో తల్లిని హత్య చేసింది.

కజిన్‌తో కలిసి స్కెచ్..

తల్లిని చంపే ప్లాన్‌ను ఆయుషి తన కజిన్ బలరామ్‌తో కలిసి చర్చించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. ప్రస్తుతం నిందితురాలు ఆయుషి పోలీసుల కస్టడీలో ఉండగా, హత్యకు సహకరించిన మరో నిందితుడు బలరామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కన్నవారిని కాదనుకుని ఆస్తి, ఉద్యోగం కోసం ఒక చదువుకున్న యువతి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.