అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం కలిసి వస్తుందంట. అంతే కాకుండా, బంగారం పెట్టుబడిగా పెట్టినా, బంగారం కొనుగోలు చేసే అదృష్టం కూడా ఈ రాశుల వారికే ఎక్కువగా ఉంటుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
కర్కాటక రాశి వారికి బంగారంతో బలమైన భావోద్వేగం ఉంటుంది. వీరు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడం లేదా బంగారం పై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా వీరు అతి త్వరలో బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. వీరికి అన్నివిధాలుగా ఇది కలిసి వస్తుంది. కాబట్టి బంగారం విషయంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వీరికి అది అదృష్టాన్నే తీసుకొస్తుంది.
సింహ రాశి వారు సహజంగానే బంగారానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అంతే కాకుండా బంగారం ధరించడం వలన వీరికి విజయం లభిస్తుంది. ఇక ఈ రాశి వారు బంగారంపై పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఇది వీరికి అనేక లాభాలను తీసుకొస్తుంది.
కన్యారాశి వారు చాలా ముందు జాగ్రత్త గల వ్యక్తులు. వీరు పెట్టుబడి పెట్టే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి, ఆచీ తూచీ అడుగులు వేస్తారు. అంతే కాకుండా వీరు బంగారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. దీనిని ఒక విలాస వస్తువుగా కాకుండా, వారి వృద్ధిగా భావిస్తారు. అంతే కాకుండా వీరికి బంగారపు లోహం కలిసి వస్తుంది. వీరికి ఉన్న ముందు జాగ్రత్తతోనే ఈ రాశి వారు త్వరలో బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




