July 11, 2026

బెల్లంపల్లి, తాండూరులో సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

బెల్లంపల్లి, తాండూరులో సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 
Reading Time: < 1 minute

బెల్లంపల్లి, తాండూరులో సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

Caption of Image.

బెల్లంపల్లి పట్టణం, తాండూరు మండల కేంద్రాల్లో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.ఇంటింటికి తిరుగుతూ బి ఎల్ వో లు నిర్వహిస్తున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. బెల్లంపల్లి పట్టణం గంగారాం నగర్ బస్తి లో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యుమారేషన్ ఫామ్ నింపారు.

ఎన్యుమారేషన్ ఫామ్ నింపడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిఎల్వో లు ఓటర్ల దగ్గరికి వెళ్లి ఫామ్ ఫిలప్ చేయాలని బీఎల్వోలను ఆదేశించారు ఎంపీ వంశీకృష్ణ. ఓటు హక్కు అనేది ఆయుధమని… ఓటు హక్కు ద్వారానే నాయకులను ప్రశ్నించొచ్చని ఓటర్లకు సూచించారు.

అనంతరం స్థానిక పిహెచ్సిని సందర్శించి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. పల్స్ పోలియోను ఎవరు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. బెల్లంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించి పునః ప్రారంభానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ.

©️ VIL Media Pvt Ltd.