Reading Time: < 1 minute

శంషాబాద్ ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..

Caption of Image.

శంషాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనఖీ లు నిర్వహించారు. శంషాబాద్ జోన్ లో శుక్రవారం ( మే 8 ) అవినీతి ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ ఎమ్మార్వో ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదుల మేరకు  ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ప్రాథమిక విచారణలో రెండు అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించామని… పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు అధికారులు.

తనిఖీల సందర్భంగా రెండు కీలక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. శంషాబాద్ ప్రాంతంలో రెవెన్యూ వ్యవహారాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఏసీబీ ఎంట్రీ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

©️ VIL Media Pvt Ltd.