Reading Time: < 1 minute
Pakistan Unveils Fatah 3 Supersonic Cruise Missile Against Brahmos

Pakistan: పాకిస్తాన్ తన కొత్త సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఫతా-3ని ఆవిష్కరించింది. ఈ క్షిపణి పాకిస్తాన్ ఫతా సిరీస్ క్షిపణుల్లో లెటెస్ట్‌ది. భారత బ్రహ్మోస్ మిస్సైల్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ దీనిని సిద్ధం చేసినట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫతా-3 ద్వారా పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలు మరింగా పెరుగుతాయి. ముఖ్యంగా సముద్రం, భూమి నుంచి ఖచ్చితమైన దాడులు చేయడానికి సహాయపడుతుంది.

ఫతా-3 చైనాకు చెందిన హెచ్‌డీ-1 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను పోలి ఉంటుంది. ఇది రోడ్ మొబైల్ క్షిపణి. దీనిని ట్రక్కు ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ క్షిపణి వ్యవస్థల్లో ట్విన్ కానిస్టర్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఒకే లాంచర్ నుంచి రెండు మిస్సైన్లను ఒకేసారి ప్రయోగించవచ్చు.

Read Also: Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..

ఫతా-3 మిస్సైల్ గంటకు 3704 నుంచి 4939 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది ధ్వని వేగం కన్నా మూడు నాలుగు రెట్టు వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 290 నుంచి 450 కి.మీ వరకు ఉంటుందని అంచనా. ఇది 240 నుంచి 400 కేజీల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు. ఇది భూ ఉపరితలానికి దగ్గరగా ప్రయాణించడం వల్ల దీనిని రాడార్లు గుర్తించడం కష్టంగా మారుతుంది.

భారత్ వద్ద ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి ఉంది. దీనిని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ ఫతా-3ని తీసుకువచ్చింది. గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వద్ద బ్రహ్మోస్ దాడికి సమాధానమే లేదు. ఇప్పుడు ఫతా-3తో భారత్‌కు ధీలుగా నిలవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.