Reading Time: < 1 minute

బాల్యం నుంచే సమానత్వం నేర్పాలి : సీఐడీ డీజీ చారుసిన్హా

Caption of Image.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆడ, మగ సమానత్వం, పరస్పర గౌరవం, విలువలను నేర్పించాల్సిన అవసరం ఉన్నదని సీఐడీ, ఏసీబీ, విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌ డీజీ చారుసిన్హా అన్నారు. అబ్బాయిలు తమ భావోద్వేగాలను భయపడకుండా వ్యక్తపరిచే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలని సూచించారు. బాధ్యత, సానుభూతి, పరస్పర గౌరవం వంటి విలువలు కుటుంబంలోనే పెంపొందుతాయని చెప్పారు. స్టాండ్ విత్‌‌‌‌ హర్‌‌‌‌‌‌‌‌ సదస్సులో భాగంగా శనివారం హైదరాబాద్‌‌‌‌లోని వీహబ్‌‌‌‌లో ఆరో విడత ప్యానెల్‌‌‌‌ నిర్వహించారు. ఈ చర్చలో నటి అమల అక్కినేని, దర్శకురాలు నందిని రెడ్డి  సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. 

పేరెంటింగ్‌‌‌‌లో తల్లిదండ్రుల పాత్రపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చారుసిన్హా మాట్లాడుతూ ప్రతి అమ్మాయికి అండగా అబ్బాయిలు నిలబడాలన్నారు. నటి అమల అక్కినేని మాట్లాడుతూ.. విద్యతో పాటు వివేకం కూడా పిల్లలకు నేర్పడం ఎంతో ముఖ్యమన్నారు. మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని చిన్నప్పటి నుంచే పెంపొందించాలని సూచించారు. దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న మూస ధోరణులను పిల్లలపై రుద్దకుండా, ప్రతి విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.