Reading Time: < 1 minute
India Govt Increases Commercial Lpg Allocation 70 Percent Fuel Relief 2026

LPG: ఎల్పీజీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ కేటాయింపులు యుద్ధం ముందు స్థాయికి పెరిగాయని ప్రభుత్వం చెప్పింది. కమర్షియల్ LPG కేటాయింపును 50 శాతం నుంచి 70 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి గతంలో 50 శాతం కేటాయింపుల్లో 40 శాతం రాష్ట్రాలకు, 10 శాతం పీఎన్జీ కనెక్షన్లకు వెళ్లేది. ఇప్పుడు పెరిగిన 20 శాతం కేటాయింపుతో పరిశ్రమలకు లభించే ఇంధనం మరింత సులువు అవుతుంది.

Read Also: Water Scam: హైదరాబాద్ వాసులారా మీరు తాగుతున్న నీరు సేఫ్‌నా.? నకిలీ జలమండలి ట్యాంకర్లు..!

కేంద్రం నిర్ణయం వల్ల ముఖ్యంగా స్టీల్, ఆటోమొబైల్, కెమికల్, ప్లాస్టిక్ రంగాలకు భారీ లాభం చేకూరుతుంది. ఈ అదనపు 20 శాతం సరఫరాను మొదట ఈ పరిశ్రమలకే అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ క్లోజ్ అయింది. అయితే, ఇండియా వంటి మిత్రదేశాలకు హార్ముజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ ఇంధనానికి కొరత లేదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని కేంద్రం చెబుతోంది.