Reading Time: < 1 minute
Amaravati Fire Incident Sit Investigation Progress And Key Developments

Amaravati Fire Incident: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపగా.. దీనిపై సిట్‌ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. అయితే, ఈ అగ్నిప్రమాదం ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తుళ్లూరు మండలం రాయపూడిలో మెగా ఇంజినీరింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పది కోట్ల విలువైన పైపులు ఈ ఘటనలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని భావించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదానికి కారణం వాచ్ మెన్ రాముగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వాచ్ మెన్ రాముతో సీన్ రిక్రియేట్ చేశారు. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటనకు పాల్పడ్డారనే కోణంలో వాచ్ మెన్ రామును విచారించారు. పోలీసుల విచారణలో వాచ్ మెన్ రాము ఒకసారి మాటలకు పొంతన లేకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాము సెల్ ఫోన్ కాల్ డేటాతోపాటు ఎవరెవరు వాచ్ మెన్ రామును కలిశారనే కోణంలో దర్యాప్తు చేసి అసలు కారణాలు తెలుసుకునేపనిలో పడ్డారు.

Read Also: Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!