Reading Time: < 1 minute
Raj Tarun Ex Girlfriend Lavanya Booked In Drunk Driving Case After Sangareddy Incident

హీరో రాజ్‌ తరుణ్ మాజీ లవర్ లావణ్య మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. మద్యం మత్తులో ఉన్న ఆమె సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ మండలం మల్లెపల్లి వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులో పాజిటివ్ రావడంతో.. లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి లావణ్య కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

లావణ్య మల్లేపల్లి వద్ద తన కారుతో ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం ఆమె పారిపోతుండగా.. కారును మల్లేపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని గ్రామస్థులు కోరినా ససేమిరా అన్నారు. అంతేకాకుండా లావణ్య గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. వారితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!

గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న లావణ్య.. ఇప్పుడు ఈ ఘటనతో మారోసారి హైలైట్ అయ్యారు. రాజ్‌ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సహజీవనం చేసి మోసం చేశాడని లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్ గుడిలో తనను వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు మరో నటితో సంబంధం పెట్టుకుని తనను దూరం పెట్టాడని ఆరోపించారు. తామిద్దరం విడిపోయామని, తనపై వస్తున్నవి అబద్ధపు ప్రచారాలని ఈ ఆరోపణలను రాజ్‌ తరుణ్ ఖండించారు. ఈ వ్యవహారం తెగల్లో టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపింది.