Reading Time: < 1 minute
Miyapur Chain Snatching Fake Internet Technician Pepper Spray Attack

Chain Snatching: చైన్ స్నాచింగ్.. అనగానే మనం ఊహించుకునేది ఒక బైక్.. ఆ బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు.. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఎటాక్.. చైన్ లాక్కుని రయ్‌మని దూసుకెళ్లడం .. ఇదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా చైన్ స్నాచింగ్‌లో ఇదే అత్యంత ప్రాచుర్యమైన స్టైల్. మరో రకం దొంగతనం కూడా ఉంటుంది. షాపుల్లోకి చొరబడి మహిళల మెడల్లో చైన్ లాక్కుని క్షణాల్లో పారిపోవడం చూస్తూ ఉంటాం. కానీ హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రూట్ మార్చారు. ఇన్నాళ్లూ బైక్ మీద రావడం.. లేదా షాపుల్లోకి చొరబడి మహిళల మెడలో గొలుసులు లాక్కుని పరారయ్యే వాళ్లు. ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే చొరబడుతున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీలు జల్లెడ పడుతున్నారు.

READ ALSO: Nellore Prostitution: హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!

మియాపూర్ ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు. తాను ఇంటర్నెట్ టెక్నీషియన్ అని, మీ ఇంట్లో నెట్‌వర్క్ సమస్య ఉందని, దాన్ని సరిచేయడానికి వచ్చానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన లక్ష్మి అతడిని ఇంట్లోకి అనుమతించింది. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే చైన్ స్నాచర్ ​వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మిని బెదిరించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేని ఆమె కళ్లలోకి కొట్టాడు. లక్ష్మి కళ్ల మంటతో విలవిల్లాడుతూ కిందపడిపోయింది. ఆమె మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు దుండగుడు. తేరుకుని చూస్తే మహిళ మెడలో గొలుసు లేదు. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు ఏ మార్గంలో వెళ్లాడనేది గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

READ ALSO: Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు.. 10 నెలల తర్వాత ఇలా..