Reading Time: < 1 minute
Ys Jagan Meets Leaders Focus On Women Reservation Delimitation And Party Strategy

YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడిన జగన్, అద్దంకి నియోజకవర్గం గెలవలేని స్థలం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై, అలాగే స్థానిక మంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మలచుకుని ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు.

Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్‌.. ఎప్పటినంచంటే..

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైసీపీ పథకాలను అమలు చేస్తానని చెప్పిన ఆయన, ఆ తరువాత “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” పేరుతో కొత్త హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అవి అమలులో కనిపించకపోవడం, మేనిఫెస్టోను పూర్తిగా విస్మరించడమేనని జగన్ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను జగన్ శుభవార్తగా అభివర్ణించారు. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ఇది సహకరిస్తుందని తెలిపారు. తమ పాలనలో మహిళలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు.

Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక ఆఫీసుల్ని ఖాళీ చేయాలని కేంద్రం అల్టిమేటం..

ఇంకా మహిళల రిజర్వేషన్ చట్టంపై కూడా జగన్ స్పందించారు. 2023లో వచ్చిన మార్పులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందని అన్నారు. 2029 నుంచి ఈ చట్టం అమలులోకి రావడం మంచి నిర్ణయమని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. అసెంబ్లీ, లోక్‌సభలో 33% మహిళా ప్రాతినిధ్యం పెరగడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. సీట్ల సంఖ్య పెరగడం వల్ల పార్టీ కార్యకర్తలకు నాయకులుగా ఎదగడానికి అవకాశాలు పెరుగుతాయని జగన్ అభిప్రాయపడ్డారు. కష్టపడి పని చేసే వారికి పార్టీ పెద్దపీట వేస్తుందని, “జగన్ 2.0”లో కార్యకర్తలకే ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.