Reading Time: < 1 minute
Telangana Politics Mla Anirudh Reddy Speech On Mahua Benefits Assembly Row

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇప్ప పువ్వు వినియోగం, దాని ద్వారా గిరిజనులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగం సభలో ఆసక్తికర చర్చకు దారితీసింది. శాసనసభ వేదికగా మాట్లాడిన అనిరుధ్ రెడ్డి.. ఇప్ప చెట్టుకు సుమారు 5000 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న చీప్ లిక్కర్ వల్ల ప్రజలు 60 ఏళ్లు కూడా బతకలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో ప్రజలు ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారాను సేవించి.. 100 ఏళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని వివరించారు. అంతేకాకుండా.. ఇప్ప పువ్వును టీలో కలిపి తీసుకోవడం వల్ల డయాబెటిస్ (చక్కెర వ్యాధి) అదుపులో ఉంటుందని శాస్త్రీయ కోణాన్ని సభ ముందు ఉంచారు.

Also Read:Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ వసూళ్ల గర్జన.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌కు!

ఇప్ప పువ్వును కేవలం సారా తయారీకే పరిమితం చేయకుండా.. ఆధునిక పద్ధతుల్లో ఐస్‌క్రీమ్‌లు, కేకులు, లడ్డూలు, బిస్కెట్ల వంటి ఆహార పదార్థాల తయారీలో వాడాలని ఆయన సూచించారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలే చొరవ తీసుకుని శిక్షణ, యంత్రాలను అందిస్తున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ‘మాండ్’ అనే ఇప్ప డ్రింక్ బాటిల్‌ను రూ. 800కు విక్రయిస్తూ భారీగా ఆదాయం గడిస్తున్న విషయాన్ని ఉదాహరణగా చూపారు.