Reading Time: 2 minutes
The Rasputin Connection Explaining The Hidden Message In Dhurandhar 2s Climax

Dhurandhar 2: ‘‘ధురంధర్ 2’’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనేక రికార్డుల్ని తుడిచిపెట్టేస్తోంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవర్. ఇక ఆదిత్య ధర్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 3.30 గంటల కన్నా ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా సినిమాను తెరకెక్కించారు. ధురంధర్ 1 తో పోలిస్తే ధురంధర్ 2 మరింత పెద్ద హిట్‌ సాధించింది.

ఇదిలా ఉంటే, సినిమా క్లైమాక్స్‌లో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఐఎస్ఐ ఇంటరాగేషన్ సమయంలో బోనీ ఎమ్ పాడిన ఫేమస్ సాంగ్ ‘‘రస్‌పుటిన్’’ వస్తుంది. అయితే, ఈ సాంగ్ పెట్టడంలో పెద్ద కథ ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఈ సాంగ్ ఐఎస్ఐ అధికారి లెఫ్టినెంట్ జనరల్ శంషాద్ హసన్ గురించి తెలుపుతుంది. ఈ సినిమాలో శంషాద్ హసన్‌గా రాజ్ జుత్షి నటించారు.

ఆ సమయంలో తన కుర్రాని వదిలేయాలని ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ శంషాద్ హసన్‌ను అడుగుతారు. శంషాద్ హసన్‌కు ఇజ్రాయిల్‌కు ఉన్న సంబంధం బయటపెడతానని, పాకిస్తాన్‌లోని ప్రజలు నిన్ను కుక్కను కొట్టినట్లు కొడుతారని బెదిరిస్తారు. దీంతో చివరకు పాక్ ఐఎస్ఐ హమ్జా (రణ్‌వీర్ సింగ్)ను విడిచిపెడుతారు. షంషాద్ తనను ఏం చేయలేరని ముందుగా భావించినప్పటికీ, చివరకు తన బండారం బయటపడటంతో వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఇది సరిగా ‘‘రస్‌పుటిన్’’ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. అందుకే, క్లైమాక్స్‌లో ‘‘రస్‌పుటిన్’’ సాంగ్ వినిపిస్తుంది.

రస్‌పుటిన్ ఎవరు?

గ్రిగోరీ రాస్పుటిన్ 19వ శతాబ్దపు రష్యాలో ఒక శక్తివంతమైన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి సోవియట్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. జార్ నికోలస్ II ఆస్థానంలో శక్తివంతమైన ఆధ్యాత్మికవేత్త, వైద్యుడిగా ఎదిగాడు. హీమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న మహారాజు కుమారుడిని నయం చేసినట్లు నటిస్తూ, మహారాణి అలెగ్జాండ్రా నమ్మకాన్ని సంపాదించి. తెరవెనక రాజకీయాల్లో కీలకంగా మారుతాడు.

అపరిమిత అధికారంతో రాజు నిర్ణయాలను రస్‌పుటిన్ ప్రభావితం చేశాడు. కొన్ని సందర్భాల్లో లంచం తీసుకుని కూడా రాజ నిర్ణయాలను మార్చాడు. అధికారం తలకెక్కి మత్తులో మునిగితేలాడు. వేశ్యలు, ఉన్నతవర్గీయులు, చివరకు రాజసభ మహిళలో సంబంధాలు పెట్టుకున్నాడు. రష్యన్ ఉన్నత వర్గాలు ఇతడిని ప్రమాదకర వ్యక్తిగా చూశారు.

చివరకు ఇతడికి 1916లో చంపేశారు. ఈ హత్య చరిత్రలో ఒక కీలకాంశంగా మిగిలింది. ముందుగా సైనైడ్ కలిపిన కేకులు తినిపించారు. అది విఫలం కావడంతో అతడిపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మరణించాడని కన్ఫామ్ అవ్వకపోవడంతో గడ్డకట్టించే నేవా నదిలో పడేశారు. అయితే, డాక్టర్ డిమిత్రి కోసోరోటోవ్ నిర్వహించిన శవపరీక్షలో రాస్‌పుటిన్ శరీరంలో విషం ఆనవాళ్లు కనిపించలేదు. తాను బలవంతుడినని నమ్మిన రస్‌పుటిన్ చివరకు హత్య చేయబడ్డాడు.

ధురంధర్ సినిమాలో కూడా ఐఎస్ఐ అధికారి షంషాద్ భారత్ తమను ఏం చేయలేదని, ఇంటర్నేషనల్ మీడియా ముందు హమ్జాను భారత ఏజెంట్‌గా చూపించాలని ప్రయత్నిస్తాడు. చివరకు పాక్ అణు సమాచారాన్ని ఇజ్రాయిల్‌కు అమ్ముతూ కనిపించిన షంషాద్ వీడియోను సచిన్ సన్యాల్(మాధవన్) పంపించడంతో కథ అడ్డం తిరుగుతుంది.