Reading Time: < 1 minute
Jr Ntr To Host Grand Party For Wife Lakshmi Pranathi Dragon Team To Attend

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఈసారి అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. దాదాపు పది కేజీలకు పైగా వెయిట్ లాస్ అయినట్టుగా టాక్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా ఎన్టీఆర్ ఒక గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Dhurandhar 2: సంచలనం.. వారం రోజుల్లో వెయ్యి కోట్లు!

మార్చి 26న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా.. గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఏటా తన భార్య పుట్టినరోజును ఎంతో వేడుకగా నిర్వహించే తారక్, ఈసారి మరింత ఘనంగా, లావిష్‌గా పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగే ఈ వేడుకలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి ‘డ్రాగన్’ చిత్ర బృందంఈ బర్త్‌డే పార్టీకి అటెండ్ కానుందని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు అతని భార్యతో పాటు.. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే.. టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలు, దర్శకులు కూడా ఈ పార్టీకి హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటికి వస్తాయెమో చూడాలి.

Also Read: Ram Charan: పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం!