Reading Time: < 1 minute

హైదరాబాద్ టోలీచౌకిలో బిల్డింగ్ పై నుంచి పడి..ముగ్గురు కార్మికులు మృతి

Caption of Image.

హైదరాబాద్ టోలీచౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. టోలిచౌకీ లోని అల్ హస్నాత్ కాలనీలో  భవన నిర్మాణ పనులు చేస్తుండగా..ఐదంతుస్థుల బిల్డింగ్ పై నుంచి ఐదుగురు కార్మికులు కిందపడ్డారు.  ఈ ఘటనలో స్పాట్ లోనే  ముగ్గురు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  నూతన భవనానికి గోవా కర్రలు కట్టి వాటిపై నిలబడి  పనులు చేస్తుండగా  ఒక్కసారిగా  కట్టెలు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

స్థానికుల సమాచారంతో వచ్చిన రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.