
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించేలా కీలక అప్డేట్ వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంటర్టైనర్ ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ రిలీజ్ డేట్ మారిపోయింది. గతంలో ప్రకటించిన మార్చి 26, 2026న కంటే వారం ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ కొత్త డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కారణం అదేనా?
ఉగాది పండుగను పురష్కరించుకుని ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన తేదీకంటే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. ఓవర్సీస్ ప్రేక్షకులకు కూడా గుడ్ న్యూస్ చెబుతూ, మార్చి 18న మధ్యాహ్నం నుండే యూఎస్ఏలో గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను మార్చి 26, 2026న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే, యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ వాయిదా పడటంతో, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధమయ్యారు.
సెలవుల అడ్వాంటేజ్!
ఈ సినిమా మార్చి 19న విడుదల కావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆ రోజున ఉగాది పండుగ కావడంతో పాటు, ఆ వెంటనే రమజాన్, వీకెండ్ ఉండటంతో సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇదే తేదీన రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ కూడా విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు నెలకొననుంది. దీనిపై స్పందించిన దర్శకుడు హరీష్ శంకర్, “ఇది పోటీ కాదు, సినిమా వేడుక” అని వ్యాఖ్యానించారు.
ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత 🔥🔥
Our USTAAD arrives a week early to spark Massive celebrations at the box office 💥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 19th MARCH, 2026.#UBSOnMarch19th
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP… pic.twitter.com/G6AoBLqxVq
— Mythri Movie Makers (@MythriOfficial) March 5, 2026
త్వరలోనే ట్రైలర్ రిలీజ్..
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, పార్తీబన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతను తమన్ చేపట్టినట్లు మేకర్స్ లేటెస్ట్ గా వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ‘భగత్ బ్లేజ్’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రోమోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ మాస్ మేనియాను చాటేలా ‘ఫ్యాన్ సర్వీస్’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
“నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను.. నా ఆటిట్యూడ్ మాత్రమే మారుతుంది!” అనే డైలాగ్ తరహాలో పవన్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్-పవన్ కాంబో కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.