Reading Time: < 1 minute

ఖమ్మం జిల్లా తల్లాడ రేంజ్ లో చిరుతపులి… సీసీకెమెరాలో విజువల్స్ రికార్డ్.. 

Caption of Image.

ఖమ్మం జిల్లా తల్లాడ రేంజ్ లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తల్లాడ రేంజ్ లోని కనిగిరి-పులిగుండాల మధ్య అటవీ ప్రాంతంలో చిరుత తన పిల్లతో ఉన్న వీడియో సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ ప్రాంతంలో చిరుత సంచారంపై సమాచారం ఉన్నప్పటికీ ఎప్పుడు కనిపిన్చచలేదని అంటున్నారు స్థానికులు. ఇప్పుడు సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అవ్వడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.

చిరుత పులి, పిల్ల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న వీడియో సీసీకెమెరాలో రికార్డయ్యిందని.. తల్లాడ రేంజ్ లోని కనిగిరి-పులిగుండాల మధ్య అటవీ ప్రాంతం, పరిసర ప్రాంతాల ప్రజలు అటవీ మార్గం నుంచి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అటవీ మార్గంలో వీలైనంత వరకు ఒంటరిగా వెళ్లోద్దని సూచిస్తున్నారు అధికారులు.

చిరుత సంచారంతో అటవీ మార్గంలో వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామని… ఆ మార్గంలో వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు స్థానికులు. అటవీ అధికారులు తగిన చర్యలు చేపట్టి చిరుతపులి బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు స్థానికులు.

©️ VIL Media Pvt Ltd.