Reading Time: < 1 minute

రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఖరారు

Caption of Image.

తెలంగాణలో ఖాళీ  అయిన రెండు రాజ్యసభ సీట్ల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడింది. ఒక సీటుకు అభిషేక్ మను సింఘ్వీ పేరు ఖరారైనప్పటికీ రెండో అభ్యర్థిని వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. మార్చి 5న అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ అందజేయనున్నారు.  అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దృష్ట్యా వీళ్లిద్దరు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

రెండో అభ్యర్థి రేసులో ముందుగా   ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  కేంద్రమాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డా. వినయ్ పేరు వినిపించింది. మార్చి 4న మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపి వేం నరేందర్ రెడ్డికి టికెట్ దక్కేలా చేశారు.

©️ VIL Media Pvt Ltd.