Reading Time: < 1 minute

పొంచి ఉన్న ఊబకాయం ముప్పు.. ప్రపంచంలోనే భారత్ రెండో స్థానం

Caption of Image.

మనదేశంలో ఊబకాయం తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది.చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులున్న దేశంగా భారత్ రెండో స్థానంలో ఉంది.2050 నాటికి 440 మిలియన్లకు పైగా ప్రజలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని, చిన్నారుల్లో కూడా ఈ సమస్య వేగంగా పెరుగుతోందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 

వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 ప్రకారం.. 5ఏళ్లనుంచి 19 ఏళ్ల లోపు పిల్లల్లో  అత్యధిక ఊబకాయులన్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో  ఉంది. చైనాలో 62 మిలియన్ల  మంది పిల్లలు ఊబకాయడంతో బాధపడుతుండగా.. భారత్ 41 మిలియన్ల మంది అధిక బరువుతో  బాధపడుతున్నారు. ప్రతియేటా బాల్యంలో ఊబకాయం 5 శాతం పెరుగుతుంది.  ఈ పెరుగుదల భారత్ లోనే అత్యధికంగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలాగే కొనసాగితే 2040 నాటికి మన దేశయువతలో అనేక జీవక్రియ సమస్యలు పెరుగుతాయని వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ అంచనా వేసింది. 

2025 నాటికి భారత్ లో ఊబకాయం సమస్యను కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా అది నెరవేరలేదు.2030 లోపైనా ఊబకాయం నియంత్రణలో లక్ష్యాన్నిచేరుకునేందుకు లక్ష్యంగా పెట్టుంది ప్రభుత్వం. అయితే ఇది సాధించాలంటే మరిన్ని విధానపరమైన చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.