
మాస్ మహారాజా రవితేజ… కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ సాంటా క్యాప్ పెట్టుకుని, చేతిలో గిఫ్ట్ పట్టుకుని ఫెస్టివ్ వైబ్‌లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ గా ప్రేక్షకుల్ని అలరించబోతుంది. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.