
తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో క్యూలైన్ లోకి భక్తుల అనుమతిని టిటిడి అధికారులు నిలిపేశారు. రేపు(శుక్రవారం, డిసెంబర్ 26) ఉదయం 6 గంటలకు భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించనున్నారు. ప్రస్తుతం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
మరోవైపు, శ్రీశైలం మల్లన్న దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లతోపాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. దీంతో మల్లన్న దర్శనానికి భక్తులకు దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది.