Reading Time: < 1 minute

రాయ్ పూర్ : ఒడిశా కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సిఆర్ఎఫ్ బలగాలు గాలింపు కొనసాగుతుంది.ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలకనేత పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే చనిపోయారని, ఉయికేపై రూ.1.10 కోట్ల రివార్డు ఉందని ఒడిశా పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టు గణేశ్ సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సుమారు 40 ఏళ్లు మావోయిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన నల్గొండ జిల్లా పుల్లేంల గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు.