Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు. హోస్ట్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆయన ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నారు. తనూజ రన్నరప్‌గా నిలిచారు. కల్యాణ్ కు విన్నర్ చెక్ తో పాటు బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు, ’రాఫ్’ నుంచి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. బిగ్‌బాస్ సీజన్–9 ఫైనల్ రేసులో ఐదుగురు కంటెస్టెంట్లు నిలవగా ఆదివారం జరి గిన ఫినాలేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యారు.

టాప్-3లో ఉంటానని భావించిన ఆమె ఈ ఫలితంతో షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత, టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలు గో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత రూ. 15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నారు. పవన్ నిష్క్ర మణతో విజేత ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల నుంచి రూ. 35 లక్షలకు తగ్గింది. చివరికి కల్యాణ్ పడాల అత్య ధిక ఓట్లు సాధించి టైటిల్ గెలుచుకోగా, తనూజ రన్నరప్‌గా నిలిచారు. స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ ఫినాలే ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠతతో సాగింది.