Reading Time: < 1 minute

GATE 2027 నోటిఫికేషన్ వచ్చేసింది: విద్యార్థులకు సూపర్ ఛాన్స్ ! పూర్తి వివరాలు ఇవే..

Caption of Image.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)– 2027 నోటిఫికేషన్​ను ఐఐటీ మద్రాస్  విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ కామర్స్/ సైన్స్/ ఆర్ట్స్/ హ్యూమానిటీస్ లో బ్యాచిలర్ డిగ్రీ  పూర్తిచేసినవారు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 

వయోపరిమితి: ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 27.

అప్లికేషన్ ఫీజు: మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 900 నుంచి రూ. 1,000 వరకు (ప్రతి పేపర్‌కు) చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇతర అభ్యర్థులు రూ.1,800 నుంచి రూ.2,000 వరకు (ప్రతి పేపర్‌కు) చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 27. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ gate2027.iitm.ac.inను సందర్శించండి.

సెలెక్షన్ ప్రాసెస్
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్: ఈ పరీక్షను 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, సంబంధిత సబ్జెక్ట్ (కోర్) నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలెక్ట్ (ఎంఎస్​క్యూ),  న్యూమరికల్ ఆన్సర్ టైప్ (ఎన్ఏటీ) విధానంలో ఉంటాయి.

నెగెటివ్ మార్కింగ్: కేవలం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు  మాత్రమే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1 మార్కు ప్రశ్నకు 1/3వ వంతు, 2 మార్కుల ప్రశ్నకు 2/3వ వంతు మార్కుల కోత ఉంటుంది. మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉండవు.

ప్రవేశాలు
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం సీఓఏపీ (కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్) లేదా సీసీఎంటీ కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఉద్యోగావకాశాలు
ప్రభుత్వరంగ కంపెనీలు ఉద్యోగ కల్పనకు గేట్ స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటాయి. గేట్ స్కోర్ షార్ట్​లిస్ట్ ఆధారంగా తదుపరి దశలైన గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ  నిర్వహించి  ఉద్యోగ నియామకాలు చేపడతాయి.

©️ VIL Media Pvt Ltd.