
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పవన్ ను అరెస్ట్ చేశారు. చాలా కాలంగా తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారని ఆరోపించింది. దీంతో పవన్ సాధినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
పవన్ పలు ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి , సేనాపతి, సినిమాలతో పాటు, పిల్ల , ఈ ఆఫీస్ లో , కమిట్‌మెంటల్, దయా వంటి వెబ్ సిరీస్‌లకు కూడా దర్శకత్వం వహించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడిలా అరెస్ట్ కావడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ‘ఆకాశంతో ఒక తారా’ మూవీకి డైరెక్టర్ గా చేస్తున్నారు. పవన్ పై ఫిర్యాదు చేసింది ప్రముఖ నటి గాయత్రి గుప్త అని సమాచారం. ఆమె ఫిర్యాదుతో చర్యలకు దిగిన పోలీసులు.. పవన్ ను అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.